కాలుష్యం వల్ల ఎముకల వ్యాధి
Posted On January 06, 2020
*హైదరాబాద్, దాని శివారుల్లో నివసించే ప్రజలు బోలు ఎముకల(ఆస్టియోపోరోసిస్) వ్యాధి బారినపడటానికి వాయు కాలుష్యమూ కారణమని స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్త ఒటావియో రంజానీ పరిశోధనలలో తేలింది.
*యన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని 28 గ్రామాలకు చెందిన 3,700 మంది ఎముకల సాంద్రతను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం వారికి ‘డ్యూయల్ ఎనర్జీ ఎక్స్‌రే అబ్జార్‌ప్షమెట్రీ’ అనే రేడియోగ్రఫీ పరీక్ష నిర్వహించారు.
*అంతేకాదు వారు ఇళ్లలో వంటలు వండటానికి జీవ ఇంధనాలు, శిలాజ ఇంధనాల్లో(కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి) వేటిని వాడుతున్నారనే వివరాలను కూడా ఓ ప్రశ్నావళి ద్వారా సేకరించారు.
* ఈ ప్రాంతాల్లోని గాలిలో క్యూబిక్ మీటరుకు 32.8 మైక్రోగ్రాముల పర్టిక్యులేట్ మేటర్-2.5 ఉన్నట్లు గుర్తించారు.
*ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం.. గాలిలో క్యూబిక్ మీటరుకు గరిష్ఠంగా 10 మైక్రోగ్రాముల పర్టిక్యులేట్ మేటర్-2.5 ఉండటాన్ని ప్రమాదకర స్థితిగా పరిగణించాల్సి ఉంటుంది.
*భారీ మోతాదులోని కాలుష్య కారకాలు శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్ల సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి.
*దీంతో జీవక్రియలు ప్రతికూలంగా ప్రభావితమై, దీర్ఘకాలంలో ఎముకలు గుల్లబారి ప్రజలు ఆస్టియోపోరోసిస్ వస్తుంది.
* ఈ అధ్యయన నివేదిక ‘జామా నెట్‌వర్క్ ఓపెన్’ జర్నల్‌లో ప్రచురితమైంది.