దిశ అమలుకు ప్రతి జిల్లాకు ప్రత్యేక న్యాయస్థానాలు
Posted On January 24, 2020
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ కేసుల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక న్యాయ స్ధానాలను ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్తర్వులు జారి చేసింది.
* న్యాయశాఖ జివో ఎంఎస్ నెంబర్ 17ను విడుదల చేసింది.
* జివో ప్రకారం,ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే ఈ కోర్టులలో 21 మంది సిబ్బంది నియామకం అవుతారు.
*కోర్టుల నిర్వహణ కోసం ఏడాదికి 1.93 కోట్లు ఖర్చు అవుతాయి. ఖర్చు మొత్తానికి కూడా జీవో అనుమతించింది.
*ఈ కోర్సులను పర్యవేక్షించే అధికారం ఎవరికి ఉంటుంది?*ఈ వ్యవహారాలను రాష్ట్ర అత్యున్నత న్యాయ స్ధానం పర్యవేక్షిస్తుంది.
*కోర్టు లోని సిబ్బంది--జిల్లా జడ్డి ఒకరు, సూపరిండెంట్ లు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, స్టేనో గ్రాఫర్ ముగ్గురు, జూనియర్ అసిస్టెంట్ ముగ్గురు, టైపిస్టులు ఇద్దరు, ఎగ్జామినర్ ఒకరు, కాపియిస్ట్ ఒకరు, రికార్డు అసిస్టెంట్ ఒకరు, అటెండెర్లు ఐదుగురు ప్రతి కోర్టులోనూ పనిచేయనున్నారు.
*దిశ చట్టం అమలుకు సంబంధించి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులుగా బాధ్యతలలో ఉన్న ఐఎఎస్ అధికారి కృతికా శుక్లాను దిశ ప్రత్యేక అధికారిగా నియమించారు.
* ప్రత్యేక అధికారి యొక్క విధులు--
మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలపై విచారణ కోసం ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేక ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఈ వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యత ప్రత్యేక అధికారిపై ఉంది.
లైంగిక వేధింపులకు గురైన వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవలు పర్యవేక్షణ బాధ్యత ప్రత్యేక అధికారిపై ఉంటుంది.
మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసులలో సంక్షేమం, ఉపశమనం, పునరావాసం, పోలీసులతో సహకారం వంటి మొత్తం బాధ్యతలను దిశ ప్రత్యేక అధికారి చూసుకుంటారు.
చట్టం అమలులో భాగంగా బాధితులకు వేగవంతమైన వైద్య సేవలు అందనుండగా, ప్రతి బోధన, జిల్లా ఆసుపత్రిలో దిశా చట్టం కోసం పత్యేక వైద్య కేంద్రం ప్రారంభిస్తారు.
*ప్రత్యేక కేంద్రం విధులు--
1.సున్నా ఎఫ్ఐఆర్ నమోదుతో సహా బాధితులకు అన్ని రకాల సామాజిక, చట్టపరమైన సహాయం అందించటం
2.వారిలో మానసిక స్ధైర్యాన్ని నింపడం.
3. ఈ కేంద్రాలలో ఒక ఎస్ఐ స్థాయి అధికారి, గైనకాలజిస్టులు అందుబాటులో ఉంటారు.
4. కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.