కిసాన్‌గాంధీ శకటానికి ప్రథమ బహుమతి
Posted On January 29, 2019
- కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2019 జనవరి 28న ఐకార్ బృందానికి అవార్డును అందజేశారు. ‘మిశ్రిత్ ఖేతీ...ఖుషియోంకీ ఖేతీ’ పేరుతో తీర్చిదిద్దిన ఈ శకటంలో మేకలు, ఆవుల మధ్యలో జాతిపిత మహాత్మాగాంధీ ఉంటారు.
- సేంద్రియ వ్యవసాయం, క్షీర విప్లవం, ఆర్యోగానికి ఆహార సూత్రాలు వంటివి శకటంలో పొందుపరిచారు. కుటీరంలో చరఖా తిప్పుతున్న రీతిలో కస్తూర్బాగాంధీ కూడా శకటంలో కనిపిస్తారు.
- పాడి పరిశ్రమ ప్రాముఖ్యం, దేశీయ జాతుల వృద్ధి, పశువు ఆధారిత సేంద్రీయ వ్యవసాయంలో గాంధీ దార్శనికతను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.