నెల్లూరులో గ్రీన్‌ల్యామ్ ఇండస్ట్రీస్ కంపెనీ
Posted On January 30, 2020
*ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సమీపంలో ఉన్న నాయుడుపేటలో గ్రీన్‌ల్యామ్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ గ్రీన్‌ల్యామ్ సౌత్ (జిఎస్ఎల్) ల్యామినేట్ షీట్లు, అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
*యూనిట్ వ్యయం -- రూ.175 కోట్లతో యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు.
*ఎన్నిఎకరాలలో --ఈ యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (ఏపీఐఐసీ) దాదాపు 65 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
*యూనిట్ సామర్థ్యం --ఏడాదికి 15 లక్షల ల్యామినేట్ షీట్లు/బోర్డుల తయారీ సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు.
*దాదాపు రెండేళ్లలో పూర్తి సామర్థ్యంతో యూనిట్ పని చేస్తుంది.
*దేశ, విదేశీ మార్కెట్లలో పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొత్త యూనిట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను రుణం, మాతృ సంస్థ ద్వారా సమకూర్చుకుంటుంది.
*ప్రస్తుతం గ్రీన్‌ల్యామ్‌కు ఏడాదికి 1.56 కోట్ల ల్యామినేట్ షీట్లు/బోర్డులను తయారు చేసే సామర్థ్యం ఉంది.
* 2019, డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో 96 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంది.