సాల్వే మరో ఘనత
Posted On January 19, 2020
*భారత్‌కు చెందిన న్యాయ కోవిదుడు, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే ఘనతను సాధించారు.
*ఇంగ్లాండ్, వేల్స్ కోర్టులకు సంబంధించి 'క్వీన్స్ కౌన్సిల్' సభ్యునిగా ఆయన నియమితులయ్యారు.
*బ్రిటన్ మహారాణి ఆస్థాన న్యాయవాది పదవిని సాల్వే మార్చి 16న చేపడతారు.
* న్యాయశాస్త్రంలో అసామాన్య ప్రజ్ఞ కనబరిచిన వారికి మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది.
*ఒక ప్రత్యేక రకమైన సిల్క్ వస్త్రాలను ధరించే క్వీన్స్ కౌన్సిల్ సభ్యులను ''టాకింగ్ సిల్క్'' అనటం సంప్రదాయం. *నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పొందిన సాల్వే, 1992 నుంచి దిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. 1992-2002 కాల వ్యవధిలో భారత సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు. సాల్వే ప్రస్తుతం బ్లాక్‌స్టోన్ ఛాంబర్స్ అనే న్యాయసంస్థలో న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.
*సీనియర్ న్యాయవాది అయిన హరీష్ సాల్వే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమక్షంలో కుల్‌భూషణ్ యాదవ్ కేసును భారతదేశం తరపున వాదించారు.
*ఈ కేసులో పాక్‌కు వ్యతిరేకంగా వాదించి, గెలవటం ద్వారా ఆయన భారత్‌కు ఘనవిజయం సాధించిపెట్టారు.
* ఈ కేసుకు ఫీజుగా ఆయన కేవలం రూ.1 మాత్రమే తీసుకున్నారు.
*ఎనిమిదవ హైదరాబాద్ నిజాం ఒక బ్రిటిష్ బ్యాంకులో 35 మిలియన్ పౌండ్లు (306 రూ. కోట్లు) డిపాజిట్ చేసిన కేసులో కూడా భారత్‌కు అనుకూలంగా తీర్పు రావటంలో హరీష్ సాల్వే ప్రముఖ పాత్ర పోషించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో సాల్వేకు రెండో అత్యున్నత విజయం.