ట్రంప్ భారత్ పర్యటన విశేషాలు
Posted On February 26, 2020
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2రోజుల పర్యటన(ఫిబ్రవరి 24,25) నిమిత్తం భారత్ కు వచ్చారు.
ట్రంప్ తో పాటు సతీమణి మెలనియా,కూతురు ఇవాంక,అల్లుడు జేర్డ్ కుషనర్,బారత్ పర్యటనకు వచ్చారు .
*తొలుత గుజరాత్ లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమానికి మోడీ తో కలిసి వెళ్లారు.
* ఆశ్రమం లో గాంధీ, కస్తూర్బా 1917-1930 లో నివసించిన హృదయ్ కుంజ్ లోకి ట్రంప్ దంపతులను తీసుకెళ్లి చూపించారు.
*ట్రంప్ దంపతులు చరఖాను తిప్పుతూ నూలు వడకడానికి ప్రయత్నించారు. ఇక్కడ దాదాపు 15 నిముషాలు గడిపారు.
* చేడు వినకు,చెడు చూడకు,చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనలను చాటించె మూడు కోతుల బొమ్మలను మోడీ ట్రంప్ దంపతులకు బహుమతిగా ఇచ్చారు.
*ఆశ్రమం తరుపున కార్తికేయ సారాబాయి ట్రంప్ దంపతులకు మహాత్మ గాంధీ ఆటోబయోగ్రఫీ పుస్తకం,చరఖా ,పెన్సిల్,డ్రాయింగ్ లను బహుకరించారు.
* తరువాత ఆశ్రమం నుంచి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన మోతెరా స్టేడియం వరకు 22కిలోమీటర్లు రోడ్ షో జరిగింది, దేశ భిన్న సంస్కృతిని భిన్న ప్రాంత కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
*తెల్లని జంప్ షూట్ వేసుకున్న మెలనియాడ్రెస్ డిజైనర్ హెర్వి పియరీ ,ఇవాంక డ్రెస్ ప్రోయోంజా షూలర్ బ్యాండ్ కు చెందినది దీని ధర రూ 1.7 లక్షలు.
*స్టేడియం ప్రారంభించిన అనంతరం నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని లక్ష మందికి పైగా తిలకించారు. ఈకార్యక్రమం ద్వారా భారత్ కు అమెరికా మిత్రదేశము అని దేశ పౌరులకు అవగహన అయినది.
*ఇలాంటి కార్యక్రమమే 2019 సెప్టెంబర్ 23 న టెక్సాస్ హ్యూస్టన్ ఎన్ఎస్ జి స్టేడియం లో 50వేల మంది ప్రవాసీ భారతీయులతో హౌడీ మోదీ పేరు తో కార్యక్రమము జరిగినది .
*నమస్తే ట్రంప్ కార్యక్రమము తరువాత ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించారు.
*మెలనియాఢిల్లీ లోని మోతిబాగ్ లో వున్నా సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్
ను సందర్శించారు ఇక్కడ గంటపాటు స్కూలును కలియ తిరిగారు.
*మట్టితో తాజ్ మహల్ ను శుభ్రం చేసిన మడ్ -ప్యాక్ ట్రీట్ మెంట్ (లైమ్ -రిచ్ క్లే మట్టిని 2మిల్లీ మీటర్ మందం పూసి ఒక రాత్రి ఉంచి ఎండిన తరువాత నీలం బ్రష్ చేత మట్టిని తొలిగిస్తారు తరువాత డిస్టిల్ వాటర్ తో శుభ్రం చేస్తారు )ను విని మెలనియా విస్మయము చెందారు.
*రాజ్ ఘాట్ లో ట్రంప్ దంపతులు మొక్కను నాటారు.
*చివరి రోజు ఐన మంగళవారంహైదరాబాద్ హౌస్ లో ట్రంప్,మోడీ సమావేశమయ్యారు 300 కోట్ల డాలర్ల తో అధునాతన ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం జరిగినది.
* మానసికఆరోగ్యము పైరెండుదేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందము జరిగినది . *ట్రంప్ దంపతులకు కేసిఆర్ చార్మినార్ కళాకృతిని అందించారు.