జోన్స్ ల్యాంగ్ లాసలే (J.L.L)జాబితాలో హైదరాబాద్ కు ప్రథమ స్థానం
Posted On January 19, 2020
జోన్స్ ల్యాంగ్ లాసలే (J.L.L)జాబితాలో హైదరాబాద్ కు ప్రథమ స్థానం; 2020 సంవత్సరానికి గాను ఇరవై అగ్రశ్రేణి నగరాల జాబితాలో హైదరాబాద్ కు ప్రథమ స్థానం లభించింది. ర్యాంకింగ్ 130 నగరాలలో చేయడం జరిగింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ స్థిరాస్తి వ్యాపారం అవకాశాలు ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130నగరాల్లో జోన్స్ ల్యాంగ్ లాసలే సంస్థ అధ్యయనం చేసింది. గతంలో ఈ సర్వేలో కూడా హైదరాబాద్కు ర్యాంకు రావడం జరిగింది(2018). గత ఏడాది నుంచి హైదరాబాదు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూ అమెజాన్ లాంటి అతి పెద్ద క్యాంపస్ ను కూడా కలిగి ఉంది. ఏడాదిలో 20 శాతం వృద్ధిని సాధించింది భారత్ నుంచి ఈ జాబితాలో హైదరాబాద్ ఒకటవ, బెంగళూరు రెండో స్థానంలో, ఢిల్లీ ఆరో స్థానంలో ,పూణే 12వ స్థానంలో ,కోల్కత్తా 16వ స్థానంలో ,ముంబై 26 స్థానంలో ఉంది అదేవిధంగా పక్కనున్న చైనా నుంచి ఐదు నగరాలు ఎంపిక కావడం జరిగింది వాటిలో అవి షెన్జెన్ 10, చొంగ్విన్ 11,వుహాన్ 13 ,హాంగ్జౌ 15, షాంగై 17వ ర్యాంకులలో ఉన్నాయి అదే విధంగా అమెరికా నుంచి సిలికాన్ వ్యాలీ 9 ,ఆస్టిన్ 19వ ర్యాంకులలో , మధ్య ఆసియా, ఆఫ్రికా నుంచి నైరోబి 4వ ర్యాంకు,దుబాయి 14వ ర్యాంకు, ఆగ్నేయాసియా నుంచి హొచిమిన్ 3వ ర్యాంకు, హనోయి 7 ,మనీలా 8 వర్యాంకుతో నగరాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి .హైదరాబాదులో వాణిజ్య సముదాయాల గిరాకీ 50 శాతం పెరిగింది. ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త ప్రోత్సాహకాలను ప్రకటించింది. లుక్ ఈస్ట్ పాలసీని ప్రభుత్వం తీసుకొని వచ్చింది . గ్రేటర్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నది. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ప్రత్యేకంగా కూల్ రూఫ్ ప్రోగ్రాం ను ప్రారంభించింది. గత ఏడాది హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది ఈ ఏడాది బెంగళూరు ను రెండో స్థానంలోకి పంపించి హైదరాబాద్ మొదటి స్థానం లోకి వచ్చింది.