ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని
Posted On November 14, 2019
* ఇంఛార్జ్ సీఎస్‌గా ఉన్న నీరబ్‌కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.
*నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యారు.
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్, మిన్నీ మాథ్యూ మహిళా సీఎస్‌లుగా సేవలందించారు.
*నీలం సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజిల్లా అసిస్టెం ట్ కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
*2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.నీలం సాహ్ని 2020 జూన్ నెలాఖరు వరకు సర్వీస్ లో ఉండనున్నారు.
*గతంలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసి బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు.ఇంచార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.