లాక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో ఐఐసీటీ ఒప్పందం
Posted On April 27, 2020
ఔషదాల తయారీలో అతిముఖ్యమైన యాక్టివ్ ఫార్మాసూటికల్స్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఇతరత్రా ముడిపదార్థాలను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేయనుంది. కరోనా వైరస్‌కు విరుగుడుగా ఔషధాల తయారీకి కావాల్సిన రసాయనాలు, ముడిపదార్థాలు అభివృద్ధి చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వాటిని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు చెందిన ఔషధ కంపెనీ లాక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో ఒప్పందం చేసుకుంది.
ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో వినియోగిస్తున్న వుమిఫెనోవిర్, రెమిడిసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) వంటి ఔషదాల తయారీ మీద దృష్టిపెడతామని ఐఐసీటీ ఏప్రిల్ 24న తెలిపింది. అయితే ఐఐసీటీలో మాత్రం ఆయా ఔషదాల మాలిక్యుల్స్, లాక్సాయ్‌లో ఫార్ములేషన్స్, డ్రగ్స్ తయారవుతాయని ఐఐసీటీ పేర్కొంది. లాక్సాయ్‌కు హైదరాబాద్‌లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన ఏపీఐ తయారీ కేంద్రాలున్నాయి.