ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం
Posted On April 28, 2020
భారత దేశం లోనే మేడిన్ ఇండియా స్ఫూర్తితో తక్కువ ఖర్చుతో కరోనాను నిర్ధారించే టెస్ట్ కిట్ ను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఈ కిట్ తయారీకి అంతా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించడం విశేషం. ఇక తాజాగా ఈ విధానానికి ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. ఐసీఎంఆర్ నుంచి అనుమతులు పొందిన తొలి విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీ కావడం విశేషం. ఈ కిట్‌లో రియల్ టైమ్ పీసీఆర్(పాలిమర్స్ చైన్ రియాక్షన్) డయాగ్నస్టిక్ విధానాన్ని అనుసరిస్తారు. ఈ విధానంపై నిర్వహించిన పరీక్షల్లో వంద శాతం కచ్చితత్వం వచ్చిందని ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది.