కరోనా వైరస్ టీకా ఉత్పత్తికి హెస్టెర్‌తో ఐఐటీ గువాహటి ఒప్పందం
Posted On May 01, 2020
కరోనా వైరస్‌ను నిరోధించడానికి టీకాను అభివృద్ధి చేయడానికి ఐఐటీ గువాహటి, అహ్మదాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెస్టెర్ బయోసైన్సెస్ ఒప్పందం చేసుకున్నాయి. రికాంబినంట్ ఏవియన్ పారామిక్సోవైరస్ సంబంధిత సాంకేతికత ఆధారంగా ఈ సంస్థలు టీకాను అభివృద్ధి చేయనున్నాయి. దీనిలో సార్స్‌కొవ్2 ఇమ్యూనోజెనిక్ ప్రొటీన్ వ్యక్తీకరణకు రికాంబినంట్ ఏవియన్ పారామిక్సోవైరస్1ను ఉపయోగిస్తారు.
గిలీడ్ సైన్సెస్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్ ఔషధానికి కరోనా వైరస్ బాధితులకు స్వస్థత చేకూర్చే లక్షణాలు ఉన్నాయని అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)నిర్వహించిన పరిశోధనలో తేలింది.