భారత వృద్ధిరేటు 4.8శాతం-ఐఎంఎఫ్
Posted On January 21, 2020
*అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మరోసారి భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించింది.
*ఐఎంఎఫ్ ప్రకారం,2020లో భారత వృద్ధిరేటు 4.8శాతంగా ఉంటుంది.
*కారణాలు -
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సెక్టార్,
బలహీన గ్రామీణ ఆదాయం పెరుగుదల వృద్ధిరేటు తగ్గించడానికి గల కారణాలు
*వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం జరుగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఈ సంస్థ తాజా నివేదికలను వెల్లడించింది.
*నివేదికలోని అంశాలు --
2022 ఆర్థిక సంవత్సరం నాటికి భారత వృద్ధిరేటు 6.5 శాతానికి చేరుకుంటుంది.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్, క్రెడిట్ గ్రోత్ క్షీణత కారణంగా భారత వృద్ధిరేటు అంచనాల తగ్గుదలకు కారణాలు
భారత దేశీయ డిమాండ్ అనుకున్నదానికంటే వేగంగా పడిపోతుంది
అంతర్జాతీయ వృద్ధిరేటును కూడా ఐఎంఎఫ్ తగ్గించింది.
2019లో అంచనా వృద్ధిరేటు 2.9శాతానికి, 2020కి 3.3శాతానికి, 2021 ఆర్థిక సంవత్సరానికి 3.4శాతానికి తగ్గించింది.
వచ్చే రెండేళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత్ లాంటి దేశాలు వృద్ధిరేటును సల్పంగా పెంచుకునే అవకాశం.
ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2019లో 3.7శాతం ఉంటే, 2020 నాటికి 4.4శాతంగా, 2021లో 4.6శాతానికి పెరుగుదల నమోదు చేస్తాయి.0.2శాతం పెరుగుదులను నమోదు చేస్తాయి.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కూడా వృద్ధిరేటు అంచనాలు మందగమనంలోనే ఉన్నాయి. 2019లో వృద్ధి 1.7శాతం ఉండగా.. ఇది 2020, 2021 నాటికి 1.6శాతానికి పడిపోయే అవకాశం ఉంది.
*ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాత్