పారా మిలటరీ దళాల్లో పనిచేస్తున్న జవాన్లకు ఆదాయ పన్ను మినహాయింపు
Posted On April 04, 2019
*పే కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటూ సాయుధ దళాలకు ఇచ్చినట్లుగానే పారా మిలటరీ దళాలకు కూడా ఆయా భత్యాలపై ఆదాయపన్నును మినహాయించాలని గతంలో హోంశాఖ ప్రతిపాదించింది, ఆర్థిక శాఖ ఇటీవల ఆమోదించింది.
*ఆయా దళాలకు నెలకు నిత్యావసర సరకుల భత్యం కింద రూ.3వేలు, ప్రతికూల పరిస్థితుల భత్యం కింద వివిధ అంశాల ప్రాతిపదికన 6 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకూ చెల్లిస్తున్నారు.
* ఇది ఆచరణ రూపం దాలిస్తే సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీల్లో పనిచేస్తున్న దాదాపు 9 లక్షల మంది జవాన్లకు లబ్ది కలగనుంది.