రైతుల ఆదాయం పెంచిన సూక్ష్మసేద్యం
Posted On July 24, 2019
* తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ చైర్మన్, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ.పార్థసారథి అధ్యక్షతన సంస్థ రెండో వార్షిక సమావేశం సచివాలయంలో జరిగింది.
* నాబార్డు నుంచి తీసుకున్న రూ.874 కోట్ల రుణ సహాయంతో అమలుచేసిన సూక్ష్మసేద్య ప్రాజెక్టు కింద సాధించిన భౌతిక , ఆర్థిక లక్ష్యాలను పార్థసారథి వివరించారు.
* ఈ ప్రాజెక్టు ద్వారా 3,75,830 ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలు అమర్చటతో నీటి పొదుపు, ఎరువులు, విద్యుత్, కూలీల ఖర్చు ఆదాతోపాటు 50 నుంచి 70 శాతం వరకు అధిక దిగుబడి రావడంతో రైతుల ఆదాయం బాగా పెరిగిందని నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు.
* సంవత్సరానికి 5-6 వేల కోట్ల చొప్పున, ఏడేండ్లకు రూ.36 వేల కోట్ల ఆదాయం రైతులకు చేరిందని నివేదిక విశ్లేషించింది.
* కేంద్రప్రభుత్వం కిసాన్ సంపద పథకం కింద ఈ యూనిట్‌కి రూ.4.28 కోట్ల రాయితీగా మంజూరు చేసిందని, దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ఇది దక్కడం అభినందనీయమని తెలిపారు.
* 2017-18 సంవత్సరం కంట్రోలర్ అండ్ అడిటర్ నివేదికను సమావేశం ఆమోదించింది.
* సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జ, కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, ఆగ్రోస్ ఎండీ సురేందర్, వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆర్థికశాఖ ఉపకార్యదర్శి శైలజ తదితరులు పాల్గొన్నారు