భారత్ బ్రెజిల్ మధ్య కీలక ఒప్పందాలు
Posted On January 27, 2020
*భారత గణతంత్ర వేడుకల్లో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
*వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు, చమురు సహజవాయువు వంటి విభిన్న రంగాలకు సంబంధించి భారత్ బ్రెజిల్ మధ్య 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
*ఏ ఏ రంగాల్లో? ---సైబర్ సెక్యూరిటీ, ఐటి రంగాలలో కూడా పరస్పర సహకార విస్తృతి,సామాజిక భద్రత, బయో ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, వైద్య రంగాల్లోఈ ఒప్పందాలు కుదిరాయి.
*నేపథ్యం-- బ్రెజిల్ అధ్యక్షులు జైర్ మెస్సియస్ బోల్సోనారో భారత్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా
*భారత్ మరియు బ్రెజిల్ ఇరు దేశాలు దాదాపు $4.5 ట్రిలియన్ల GDP మరియు 1.5 బిలియన్ల జనాభా కలిగి ఉన్నాయి.
*భారత్ మరియు బ్రెజిల్ మధ్య 2018-19 సంవత్సరంలో $8.2 బిలియన్ల వాణిజ్యం జరగగా( $3.8 బిలియన్ల విలువల గల భారత ఎగుమతులు,$4.4 బిలియన్ల బ్రెజిల్ నుండి భారత్ కు ఎగుమతులు), 2022 నాటికి $15 బిలియన్లకు పెంచడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.
*ఆయిల్ మరియు సహజ వాయువు,జీవ ఇంధనం అంశాల్లో ప్రత్యేకమైన ఒప్పందం కుదిరింది.
*ఇరు దేశాల ప్రధాన మంత్రులు ఇథనాల్ ఉత్పత్తిలో సహకారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ రంగంలో బ్రెజిల్ దేశం అపారమైన అనుభవం కలిగి ఉండడం వల్ల దానికి సంబంధించిన సాంకేతికతను భారతదేశానికి ఇవ్వనుంది.
*పశుసంవర్ధక రంగంలో సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.ఇరు దేశాలు పశువుల అంశంలో జనరిక్ హెరిటేజ్ కలిగి ఉన్నాయి.పశువుల ప్రత్యుత్పత్తి పెంచే సాంకేతికత ఇరు దేశాలు పంచుకోవడం ద్వారా భారతదేశంలో డెయిరీ రంగం అభివృద్ధి చేయనున్నారు
*భారతదేశంలో బ్రెజిల్ సహకారంతో సెంటర్ ఫర్ ఎక్స లెన్స్ ఇన్ కాటిల్ జీనోమిక్స్ ఏర్పాటు చేయనున్నారు.
*2018లో బ్రెజిల్ లో భారత పెట్టుబడులు $6 మిలియన్లు కాగా భారతదేశంలో బ్రెజిలియన్ పెట్టుబడులు $1 బిలియన్ గా ఉన్నాయి.