'సీ గార్డియన్స్' ఈ నేపథ్యంలో అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య
Posted On January 11, 2020
*భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు.
*'సీ గార్డియన్స్' పేరుతో చైనా-పాకిస్థాన్ తొమ్మిది రోజులపాటు సంయుక్తంగా జరిపే భారీ నౌకా విన్యాసాలు జనవరి 13న ప్రారంభం .
*ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతలో భాగంగా భారత్ తన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను తీరప్రాంతంలో మోహరించింది.
*మిగ్ 29కె యుద్ధవిమానంతో కూడిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా పంపడం జరిగింది.
*ఇరు దేశాలకు చెందిన డిస్ట్రాయర్స్, ఫిగ్రేట్స్‌తోపాటు సబ్‌మెరైన్స్ కూడా ఇందులో భాగం.
*ఇరు దేశాల మధ్య అంతర్ కార్యాచరణ, వ్యూహాత్మక సహకారం లక్ష్యంగా 'సీ గార్డియన్స్' పేరుతో చైనా- పాక్‌లు ఈ విన్యాసాలను నిర్వహిస్తారు.
*చైనా ఉత్తర అరేబియా సముద్రంలో పాక్‌కు చెందిన లోతైన నీటి గ్వాడార్ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ గ్వాడార్ 60 బిలియన్ డాలర్లతో రూపొందుతున్న చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలోని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి)ని అనుసంధానిస్తోంది.
*INS విక్రమాదిత్య భారత్ రష్యా నుండి కొనుగోలు చేసిన విమాన వాహక నౌక. కీయెవ్ తరగతికి చెందిన అడ్మిరల్ గోర్ష్‌కోవ్ విమాన వాహక నౌకను విక్రమాదిత్యగా పునర్నిర్మించారు. ఇది 2013 లో భారతీయ నౌకాదళం లోకి ప్రవేశించింది.