అంతర్జాతీయ ర్యాంకింగ్ లో భారత విశ్వవిద్యాలయాలు
Posted On November 28, 2019
*QS ప్రపంచ విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ ఏషియా 2020 లో భారతదేశానికి చెందిన 96 విశ్వవిద్యాలయాలకు స్థానం లభించింది.
* ఇందులో 20 కొత్త విశ్వవిద్యాలయాలకు స్థానం లభించింది.
* ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే 33 వ స్థానంలో ఉండి,దేశం నుండి మొదటి స్థానాన్ని పొందింది. మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ 43వ స్థానంలో,ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ 50వస్థానం లో ఉంది.
*మొదటి 250 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో భారతదేశం నుండి 31 సంస్థలు ఉన్నాయి.
*Quacquarelli Symonds (QS) ర్యాంకింగ్ లో మొదటి 100 విద్యాసంస్థల్లో భారతదేశానికి చెందిన ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
*గత దశాబ్దకాలంగా భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ ఎక్కువగా పెరుగుతూ వస్తోంది.
*ఉన్నత చదువుల కొరకు దేశీయంగా డిమాండ్ యువతలో ఎక్కువగా పెరుగుతూ వస్తోంది.
*భారతదేశంలో విద్యారంగంలో పరిశోధన, బోధన, అంతర్జాతీయీకరణ కొరకు పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింత అభివృద్ధి సాధిస్తుంది.
*నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈ మొత్తం ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉంది మరియు రెండవ స్థానంలో నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉంది. మూడవ స్థానంలో హాంకాంగ్ విశ్వవిద్యాలయం ఉంది.
*ఈ ర్యాంకింగ్లో చైనా దేశం నుండి 118 విద్యా సంస్థలు స్థానం పొందాయి మరియు మొదటి 10 విద్యా సంస్థల్లో చైనా నుండి నాలుగు ఉన్నాయి.