బీఎస్-6 ప్రమాణాలతో పెరగనున్న ఇంధన ధరలు
Posted On January 31, 2020
*బీఎస్-6 ఉద్గార-అల్ట్రా క్లీన్-వాహన ఇంధనాలకు భారత్ ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి మారుతూ ఉండడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు రూ.0.50 నుంచి రూ.1 మేర పెరిగే అవకాశముంది.
*ప్రస్తుతం దేశంలో బీఎస్-4 ప్రమాణాల ఇంధనం ఉపయోగిస్తున్నారు.
* ఇది యూరో-4 ప్రమాణాలకు సరిసమానం.
*కాలుష్యానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్-2020 నుంచి నేరుగా (బీఎస్-5ను తప్పించేసి) కొత్త ప్రమాణాలను అమలు చేయాలని నిర్ణయించింది.
* బీఎస్-6 ప్రమాణాలతో ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రిఫైనరీలను మార్చేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.17,000 కోట్ల పెట్టుబడి పెట్టగా, మొత్తం పరిశ్రమ రూ.30,000 కోట్లు వెచ్చించింది.
* బీఎస్-4 ప్రమాణాల ఇంధనంతో పోల్చితే బీఎస్-6 ప్రమాణాల ఇంధనం ధరలు అధికంగా ఉంటాయి.