సముద్ర సేతు ఆపరేషన్‌ను ప్రారంభించిన భారత నావికాదళం
Posted On May 06, 2020
లాక్‌డౌన్ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి దేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారత నావికాదళం ‘సముద్ర సేతు’ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ ద్వారా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని జలమార్గ ద్వారా భారత్‌కు తిరిగి తీసుకురానున్నది. భారత నావికాదళం ఐఎన్‌ఎస్ జలాశ్వ, ఐఎన్‌ఎస్ మగర్ మాల్దీవులకు బయల్దేరాయి. ఫేజ్-1 లో భాగంగా ఈ నెల 8వ తేదీన మాల్దీవుల నుంచి వెయ్యి మంది భారతీయులను భారత్‌కు తీసుకురానున్నాయి.