ఇమిశాట్ (EMISAT) ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో
Posted On April 02, 2019
*భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మొదటిసారిగా 3 కక్ష్యల మిషన్‌తో సత్తా చాటింది. గతంలో సాధించిన 2 కక్ష్యల రికార్డును అధిగమించింది. 749, 504, 485 కిలోమీటర్ల ఎత్తులో 3 కక్ష్యల్లోకి పంపింది.
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఏప్రిల్ 1న పీఎస్‌ఎల్‌వీ-సీ45 వాహక నౌక ద్వార పంపింది
* ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన తర్వాత డీఆర్‌డీవోకు చెందిన 436 కిలోల నిఘా ఉపగ్రహం ఇమిశాట్‌ను 749 కిలోమీటర ఎత్తులో ప్రవేశపెట్టింది.
* అక్కడి నుంచి 504 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను కక్ష్యలో విడిచిపెట్టింది.
*485 కిలోమీటర్ల ఎత్తు గల కక్ష్య నుంచే 6 నెలలపాటు పరిశోధన జరగనుంది.
* పీఎస్‌ఎల్‌వీ-సీ46 ద్వారా రీశాట్-2బీ, ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ-సీ47 ద్వారా కార్టోశాట్, ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు.
*ఇమిశాట్‌ను డీఆర్‌డీవో రూపొందించింది
*దీనికి ఆ సంస్థ అధిపతి జి.సతీశ్‌రెడ్డి నాయకత్వం వహించారు
*ఈ ఉపగ్రహం తక్కువ ఎత్తులో తిరుగుతూ శత్రు దేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని అందించనుంది.
*శత్రు దేశాలూ మన కదలికలను పసిగట్టకుండా చూసే వ్యవస్థ ఇందులో ఉంది.
* ఇమిశాట్ ప్రాజెక్ట్ కౌటిల్యా క్రింద rs 462 cr తో రూపొందించింది.
*ఇజ్రాయిల్ నిఘా ఉపగ్రహం సరళ్ దీనికి మాతృక-ప్రేరణ
DRDO:
- The DRDO was established in 1958
- A separate Department of Defence Research and Development was formed in 1980
- Headquarters: New Delhi
- Headquarters: Bengaluru
- Founder: Vikram Sarabhai
- Founded: 15 August 1969
- Chairman: Kailasavadivoo Sivan