జీడీపీ వృద్ధి 5.7శాతం - ఐక్యరాజ్యసమితి
Posted On January 19, 2020
* ఐక్యరాజ్యసమితి భారత జీడీపీ గణాంకాల్ని తగ్గించింది. 2019-20లో జీడీపీ వృద్ధి 5.7శాతం నమోదుకావొచ్చని తాజాగా అంచనావేసింది.
*ఇంతకుముందు ఆర్‌బీఐ, ఎస్ బీఐ, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, మూడీస్, నోమురా (రేటింగ్ సంస్థలు)...భారత జీడీపీ వృద్ధి తగ్గుతుం దని అంచనావేశాయి.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాదికి సంబంధించి వివిధ దేశాల వృద్ధి అంచనాలను తెలియజే స్తూ ఐరాస నివేదిక (ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు- 2020)ను విడుదలచేసింది.
* చైనా 2019లో 6.1శాతం జీడీపీ వృద్ధి సాధించవచ్చునని ఐరాస అంచనావేసింది.
*కూరగాయల ధరలు 60.5శాతం, పప్పు దినుసుల ధరలు 15.44శాతం పెరిగాయి.
* డిసెంబరు 2019లో రిటైల్ ద్రవ్యోల్బణం (టోకు ధరల ఆధారిత) 7.35శాతానికి పెరిగింది.
*జులై 2014 తర్వాత అత్యధికస్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది.
*సీఎంఐఈ తాజా గణాంకాల ప్రకారం, 13 జనవరి 2020నాటికి నిరుద్యోగం 7.6శాతానికి (45ఏండ్ల గరిష్టం) పెరిగింది.
*దేశ జీడీపీలో 7శాతం వాటా, తయారీరంగంలో 49శాతం వాటా కలిగివున్న వాహనరంగం అనేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నది.
*గత రెండు సంవత్సరాలుగా వాహన అమ్మకాలు క్షీణించాయి. అమ్మకాలు 19ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి.
*ఐఐపీ సెప్టెంబరులో 4.3శాతం, అక్టోబరులో 3.8శాతం నమోదైంది. గణాంకాలు 8ఏండ్ల కనిష్టానికి చేరుకున్నాయి.