భారతదేశ నిరుద్యోగిత రేటు 27.11% కి పెరిగింది: CMIE
Posted On May 07, 2020
Centre for Monitoring Indian Economy (CMIE) గణాంకాల ప్రకారం, కోవిడ్ -19 లాక్‌డౌన్ కారణంగా మే 3 న వారంలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి పెరిగింది. అంతకుముందు 2020 మార్చి 15 తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 6.74%. లాక్డౌన్ సమయంలో, దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి, ఇది భారతదేశంలో నిరుద్యోగం పెరగడానికి దారితీసింది.