'సహోగ్-కూజిన్' యుద్ధవిన్యాసాలు
Posted On January 17, 2020
*భారత సముద్రతీర భద్రతాదళంతో కలిసి ఉమ్మడి యుద్ధవిన్యాసాలు నిర్వాహణకు జపాన్ నుంచి వచ్చిన 'ఎచిగో' యుద్ధనౌకకు కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులు, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు.
*'సహోగ్-కూజిన్' పేరుతో ఈనెల 16న బంగాళాఖాతంలో ఉమ్మడి యుద్ధ విన్యాసాలు జరిగాయి.
* ఈ నౌకతో పాటు భారత సముద్రతీర భద్రతాదళానికి చెందిన నాలుగు నౌకలు, విమానాలు, ఈ విన్యాసాల్లో
పాల్గొన్నాయి.
*2006లో ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు అనువుగా రెండు దేశాలకు చెందిన సముద్రతీర భద్రతదళాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ మేరకు 'సహోగ్-కూజిన్' పేరుతో ఈనెల 16న బంగాళాఖాతంలో ఉమ్మడి యుద్ధ విన్యాసాలు జరిగాయి.
*ఐదు రోజల సద్భావనా పర్యటనలో భాగంగా వచ్చిన జపాన్ కోస్ట్‌గార్డ్ నౌక ఎచిగోతోపాటు భారత సముద్రతీర భద్రతాదళానికి చెందిన నాలుగు నౌకలు, విమానాలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎస్‌ఐఓటి) నుండి వచ్చిన మరో నౌక ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి.