తెలంగాణ ఇరిగేషన్ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు
Posted On April 04, 2019
* ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ) ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబరులో ఇండోనేసియాలో జరిగే అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ఇరిగేషన్ విధానాలను చర్చించేందుకు అవకాశం లభించింది. *ప్రతి ఏటా ఐసీఐడీ నిర్వహించే సదస్సులో భాగంగా ఈ ఏడాది చర్చించేందుకు వివిధ కేటగిరీలో సాంకేతిక పత్రాలను ఆహ్వానించింది.
* ఈ సదస్సు కోసం మిషన్ కాకతీయ, నాగార్జున సాగర్ ఆధునీకీకరణ, నిజాం సాగర్ పరిధిలో నీటి సమర్థ వినియోగం, నీటి పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెట్టిన టెయిల్ టు హెడ్ విధానాలపై తెలంగాణ ఇంజనీర్లు ప్రత్యేక పత్రాలు సమర్పించారు. ఈ పత్రాలపై ప్రత్యేక చర్చను నిర్వహించేందుకు ఐసీఐడీ అంగీకరించింది.
*ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ)
* ప్రారంభంః 1950
* ఇది లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ