చైనా మహిళల ఫుట్‌బాల్‌కు జాక్ మా 995 కోట్లు విరాళం
Posted On July 08, 2019
* చైనా మహిళల ఫుట్‌బాల్ అభివృద్ధికుగాను తన వంతుగా ఏకంగా 100 కోట్ల యువాన్‌లు (రూ. 995 కోట్లు) విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. రాబోయే పదేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని చైనా మహిళల ఫుట్‌బాల్ రంగంపై వెచ్చిస్తారు.
* గాయపడిన క్రీడాకారిణిల చికిత్సకు, రిటైరయిన వారి జీవనోపాధికి, యువ క్రీడాకారిణిల అభ్యున్నతికి ఈ డబ్బును ఉపయోగించనున్నారు.
* అంతర్జాతీయస్థారులో చైనా పురుషుల ఫుట్‌బాల్ జట్టుకంటే మహిళల ఫుట్‌బాల్ జట్టు మెరుగ్గా రాణిస్తోంది.
* అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు - జాక్ మా
* అలీబాబా గ్రూప్ 4 ఏప్రిల్ 1999 న స్థాపించబడింది