ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్‌గా జాక్వెలీన్ హ్యూగ్స్
Posted On May 02, 2020
- (ఇక్రిశాట్) కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జాక్వెలిన్ డీ అరోస్ హ్యూగ్స్ ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌కు చెందిన హ్యూగ్స్ మైక్రో బయాలజీ, వైరాలజీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.
- 1990లలో కోకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసేందుకు ఆఫ్రికాలోని ఘనా దేశానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నైజీరియాలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్‌లో కొంతకాలం పనిచేశారు.
- తైవాన్‌లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన హ్యూగ్స్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ అదే హోదాలో పనిచేశారు. తాజాగా రైస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్రిశాట్‌కు మారారు.