అత్యధిక శౌర్య పతకాలను పొందిన జమ్మూకాశ్మీర్
Posted On January 27, 2020
*రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు సిబ్బందికి వెయ్యి పతకాలను ప్రకటించారు. శౌర్య పతకాల్లో 108 జమ్ముకశ్మీర్ పోలీసులకు దక్కాయి. 290 గ్యాలంట్రీ / శౌర్య అవార్డుల్లో 108 జమ్ముకశ్మీర్ జవాన్లకు దక్కాయి.
*సశస్త్ర సీమాబల్(ఎస్ ఎస్ బి)కు చెందిన నలుగురు రాష్ట్రపతి సేవా పతకాలకు ఎంపికయ్యారు.
*తీవ్రవాద, తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆరుగురు ఆర్మీ సిబ్బందికి శౌర్యచక్ర అవార్డు లభించింది. వారు --
*లెఫ్టినెంట్ కల్నల్ జ్యోతి లామా
*మేజర్ కె.బిజేంద్ర సింగ్
*నాయిబ్ సుబేదార్ నరేందర్ సింగ్
*నాయక్ నరేశ్ కుమార్
*గత ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో మరణించిన నాయిబ్ సుబేదార్ సాంబిర్‌కు మరణానంతరం శౌర్యచక్ర ప్రకటించారు.ఎదురుకాల్పుల్లో విదేశీ, 'ఏ++' కేటగిరీ ఉగ్రవాదిని సాంబిర్ కాల్చిచంపారు.
*శౌర్య అవార్డులను కేంద్ర ప్రభుత్వం అత్యంత ధైర్య,సాహసాలు ప్రదర్శించిన ఆర్మీ అధికారులు, ఆర్మీ సిబ్బంది,ఇతర చట్టపరంగా నియమించబడిన దళాల వారికి అందిస్తుంది.