జపాన్ బ్యాంక్ తొలి మహిళా డైరెక్టర్ గా టోకికో
Posted On May 13, 2020
జపాన్ సెంట్రల్ బ్యాంక్ కు తొలి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా టోకికో షిమిజు నియమితులయ్యారు. జపాన్ సెంట్రల్ బ్యాంక్ ను 1882 లో స్థాపించారు. బ్యాంక్ స్థాపించిన తరువాత ఒక మహిళ ఈ పదవిని నిర్వహించడం ఇదే మొదటిసారి. టోకికో 1987 నుంచి బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో బ్యాంకు ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2016 నుంచి 2018 మధ్య లండన్ ప్రధాన ప్రతినిధిగా ఐరోపాకు జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. జపాన్ జనాభాలో మహిళలు 51 శాతం ఉండగా.. 2018 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక ఫోరం తాజా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 153 దేశాలలో జపాన్ 121వ స్థానంలో ఉంది.