2026 నాటికి తొలి ట్రిలియనీర్‌గా అమెజాన్ బెజోస్
Posted On May 18, 2020
వివిధ వ్యాపారాలపై తులనాత్మక అధ్యయనం చేసే కంపేరిజన్ సంస్థ అపర కుబేరుల సంపదకు సంబంధించి తాజా నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 2026 నాటికి అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ (56) ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ గా అవతరించనున్నారట. 62 సంవత్సరాల వయసు నాటికి బెజోస్ 1,000 బిలియన్లకు పైగా నికర విలువను సాధించే అవకాశం వుందని కంపారిసున్ చేసిన అధ్యయనం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్‌అంబానీ 2033 నాటికి ట్రిలియనీర్ కావచ్చని అంచనా వేసింది. కంపారిసున్ ప్రకారం, ఈ ఘనత సాధించిన ప్రపంచంలో ఐదవ వ్యక్తిగా అంబానీ నిలవనున్నారు. చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జు జియాయిన్ ప్రపంచంలో రెండవ ట్రిలియనీర్ కావచ్చని అధ్యయనం తేల్చింది.