జార్ఖండ్ తన వలస కార్మికులను రైలు ద్వారా తిరిగి తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా అవతరించింది
Posted On May 02, 2020
తెలంగాణ నుండి రైలు ద్వారా వలస వచ్చిన కార్మికులను తిరిగి తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా జార్ఖండ్ అవతరించింది. లాక్‌డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలస కార్మికులు ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ప్రత్యేక రైలును తెలంగాణలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ మరియు రాంచీ యొక్క హతియా రైల్వే స్టేషన్ మధ్య నడిపారు. లాక్‌డౌన్ తర్వాత ఇలా కార్మికులను రైలులో తరలించడం ఇదే మొదటిసారి. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్‌కు శుక్రవారం ఉదయం 4.50గంటలకు బయల్దేరింది.
రాష్ట్రంలోని కంది మండలం ఐఐటీలో పనిచేస్తున్న జార్ఖండ్ వలస కార్మికులు ఈ ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలి వెళ్లారు. ఐఐటీ భవన నిర్మాణంలో జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశాలకు చెందిన 2,464 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తమను సొంత ప్రాంతాలకు వెళ్లనివ్వాలని గత రెండు రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. దీంతో జార్ఖండ్‌కు చెందిన 1239 మంది కార్మికులను ప్రత్యేక రైలులో తరలించారు.