గ్రీన్‌పీస్ ఇండియా - కాలుష్యంపై నివేదిక
Posted On January 21, 2020
*గ్రీన్‌పీస్ ఇండియా అనే సంస్థ దేశంలోనే కాలుష్యంపై నివేదిక విడుదల చేసింది.
*నివేదికలోని అంశాలు -
వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఢిల్లీ కాస్త విజయం సాధించింది.
జార్ఖండ్‌లోని ఝరియా భారత దేశంలో అత్యంత కలుషిత నగరంగా కొనసాగుతోంది.
దేశంలోని 287 నగరాల్లో సమాచారాన్ని అధ్యయనం చేసి, ఈ నివేదికను రూపొందించారు.
పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం)10 డేటా ఆధారంగా విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.
భారత దేశంలో అత్యంత కలుషిత నగరాల్లో 10వ స్థానంలో ఢిల్లీ ఉంది. ఇది ఓ ఏడాది క్రితం 8వ స్థానంలో ఉండేది.
కాలుష్య నగరాల జాబితాలో రెండో స్థానంలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఉంది. ధన్‌బాద్, ఝరియా నగరాలు బొగ్గు నిక్షేపాలు, పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఉన్నాయి.
మిజోరాంలోని లుంగ్లీ కలుషిత నగరాల జాబితాలో చివరిలో ఉంది.
టాప్ టెన్ కలుషిత నగరాల్లో ఆరు నగరాలు ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నాయి. నోయిడా, ఘజియాబాద్, బరేలీ, అలహాబాద్, మొరాదాబాద్, ఫిరోజాబాద్.