అత్యాచారాల కేసుల శీఘ్ర విచారణకు ద్విసభ్య కమిటీ
Posted On December 17, 2019
*దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
*జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నియమించారు.
*మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన 'దిశ' కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
*దేశవ్యాప్తంగా ఉన్న ఈ తరహా కేసులు శీఘ్రగతిన పరిష్కారం కావాలన్న ఉద్దేశంతోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే ఈ నిర్ణయం తీసుకున్నారు.