కన్నడ సాహితీవేత్త నిస్సార్ కన్నుమూత
Posted On May 05, 2020
కన్నడ సాహితీవేత్త, నిత్యోత్సవ కవిగా పేరొందిన కె.ఎస్ నిస్సార్ అహ్మద్ (84) మే 3న కన్నుమూశారు. ఫిబ్రవరి 5, 1936 న దేవనహళ్లిలో జన్మించిన అహ్మద్ వృత్తిరీత్యా భూగర్భ శాస్త్ర ప్రొఫెసర్ అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించిన నిస్సార్ 1978లో ‘నిత్యోత్సవ’ పేరిట తొలి పాటల క్యాసెట్‌ను విడుదల చేశారు. 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. కర్ణాటక సాహిత్య అకాడమీ, కెంపేగౌడ పురస్కారం, 1981 లో రాజ్యోత్సవ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అహ్మద్‌కు 2008 లో పద్మశ్రీని ప్రదానం చేశారు. అరసు వంటి పురస్కారాలు పొందారు. నిసార్ అహ్మద్ 73వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడిగా వ్యవహరించారు.