గౌరీ లంకేష్ పురస్కారం పొందిన కాశ్మీరీ రిపోర్టర్
Posted On January 30, 2020
*గౌరీ లంకేష్ స్మారక పురస్కారం--
ఎవరికి లభించింది?--2017లో హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ స్మారక పురస్కారాన్ని ఈ ఏడాది కాశ్మీరీ రిపోర్టర్ యూసఫ్ జమీల్ అందుకున్నారు.
*అవార్డును అందించింది ?ఈ అవార్డును భారతీయ రచయితల కేంద్రం 'పెన్' అందించింది.
*ఈ అవార్డును స్థాపించినది --2018 సంవత్సరంలో
* తొలిసారి ఈ అవార్డు పొందినది -- 2018లో తొలిసారిగా కార్టూనిస్ట్ పి మహ్మద్ ఈ అవార్డు పొందారు.
*యూసఫ్ జమీల్--
*1980 తొలినాళ్లలో శ్రీనగర్‌కు చెందిన ఉర్దూ దినపత్రిక అఫ్తాబ్‌లో జమీల్ తన కెరీర్‌ను ప్రారంభించారు.
వృత్తిపరమైన సమగ్రతకు ఆదర్శప్రాయమైన నిబద్ధత, ప్రజాస్వామ్య ఆదర్శాలను కనబర్చినందుకు 2019-20కిగానూ జమీల్‌కు ఈ అవార్డు అందింది.
*టెలిగ్రాఫ్, బిబిసి, రాయిటర్స్, టైమ్, వాయిస్ ఆఫ్ అమెరికా, ద ఏషియన్ ఏజ్ వంటి పలు మీడియా సంస్థల్లో ఆయన విధులు నిర్వహించారు. కాశ్మీర్‌లో క్లిష్టమైన పరిస్థితుల్లో రిపోర్టుగా సేవలు అందించారు.
*నిర్భయమైన జర్నలిజానికి మార్గదర్శకులని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.
*అవార్డ్ కింద నగదు - లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు.