WHO లో భారత్‌కు కీలక బాధ్యతలు
Posted On April 25, 2020
కొవిడ్‌పై పోరులో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో(డబ్ల్యూహెచ్‌వో) కీలక బాధ్యతలను చేపట్టనుంది. ఈ సంస్థ కార్యనిర్వాహక మండలి అధ్యక్ష బాధ్యతలను మే 22న భారత ప్రతినిధి చేపట్టనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 34 మంది సభ్యులు, ఒక అధ్యక్షుడు ఉండే ఈ కార్యనిర్వాహక మండలిని వచ్చే నెల 18న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్‌ఏ) లాంఛనంగా ఎన్నుకోనుంది.
34 మంది సభ్యులున్న ఎగ్జిక్యూటివ్ బాడీకి ప్రస్తుతం జపాన్ అధ్యక్షత వహిస్తోంది. దాని పదవీ కాలం మే నెలతో అయిపోనుంది. ఇప్పటికే నిర్ణయం జరిగిన మేరకు మే 18న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత భారత్ బాధ్యతలను చేపట్టనుంది.
ఎగ్జిక్యూటివ్ బాడీ చైర్‌పర్సన్ హోదాలో భారత ప్రతినిధి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్‌కు కీలక నిర్ణయాల్లో సహాయం, సూచనలు అందిస్తారు.