అథ్లెట్ సందీప్ కుమారిపై నాలుగేళ్ల నిషేధం
Posted On May 05, 2020
డోపింగ్‌లో విఫలమైన డిస్కస్ త్రోయర్ సందీప్ కుమారిపై నాలుగేళ్ల నిషే ధం విధించారు. 2018 జూన్‌లో నిర్వహించిన ఇంటర్‌స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప సందర్భంగా కుమారి నుంచి సేకరించిన రక్త నమూనాలో నిషిద్ధ ఉత్ర్పేరకం మెటనోలోన్ ఉండడంతో ఆమెపై వేటు వేస్తూ అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) నిర్ణయం తీసుకుంది.గువాహటిలో జరిగిన ఆ మీట్‌లో కుమారి స్వర్ణ పతకం సాధించింది.