భారత్‌లోనే అత్యధికంగా నిరాశ్రయులు: యూనిసెఫ్
Posted On May 07, 2020
ప్రపంచంలోనే అత్యధికంగా నిరుడు భారత్‌లో సుమారు 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస బాలల నిధి విభాగం ‘యూనిసెఫ్’ వెల్లడించింది. ‘లాస్ట్ ఎట్ హోమ్’ పేరుతో మే 5న యూనిసెఫ్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత్ తర్వాత ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, చైనా దేశాల్లో అత్యధికంగా నిరాశ్రయులయ్యారు.
22019లో 50,37,000 మంది భారతీయులు దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోగా...వీరిలో 50,18,000 మంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా; 19 వేల మంది ఘర్షణలు, హింస కారణంగా నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ వివరించింది. మరోవైపు 2019లో ప్రపంచ వ్యాప్తంగా 3.30 కోట్ల మంది నిరాశ్రయులుగా మారారు. వీరిలో 1.2 కోట్ల మంది చిన్నారులే ఉన్నారని యూనిసెఫ్ పేర్కొన్నది.