ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ల్యాండ్ అయిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్
Posted On January 11, 2020
*భారత నౌకాదళ చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైంది.
*యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై.. నావెల్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ ను విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఎల్‌సీఏను డీఆర్‌డీవో తయారు చేసింది.
*స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ద విమానాన్ని.. విక్రమాదిత్యపై దించడం ఇదే తొలిసారి.
* ఈ ఫైటర్ విమానాన్ని డెవలప్ చేసేందుకు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తీవ్రంగా కృషి చేస్తుంది.
*గోవాలోని షోర్ బేస్డ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్‌లో ఈ పరీక్ష కొనసాగింది. విక్రమాదిత్యపై ల్యాండ్ అయ్యేందుకు పైలట్లు కొన్ని వంద గంటల పాటు ట్రైనింగ్ చేశారు.
* లైట్ కంబాట్ విమానానికి కమాండర్ జైదీప్ మాలంకర్ పైలట్‌గా చేశారు.