'ది ఫార్ ఫీల్డ్' నవలకు క్రాస్‌వర్డ్ బుక్ అవార్డు
Posted On January 19, 2020
*యువ రచయిత్రి మాధురీవిజయ్ (32)ని ప్రతిష్ఠాత్మక 'క్రాస్‌వర్డ్ బుక్ అవార్డు (జ్యూరీ కేటగిరీ)' దక్కింది.
*కశ్మీర్ లోయలో పరిస్థితులను ఆవిష్కరించిన 'ది ఫార్ ఫీల్డ్' నవలకు గాను ఈ పురస్కారం లభించింది.
*బెంగళూరులో జన్మించిన మాధురి.. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. 'ది ఫార్ ఫీల్డ్' ఆమె రచించిన తొలి నవల.
*ఆ నవలకు భారత్‌లో అత్యంత ఖరీదైన సాహిత్య బహుమతిగా పేరున్న జేసీబీ ప్రైజ్ (సాహిత్యం)తోపాటు టాటా లిటరేచర్ లైఫ్ ఫస్ట్ బుక్ అవార్డును ఇప్పటికే గెల్చుకున్నారు.
*సల్మాన్ రష్దీ, విక్రమ్ సేఠ్, కిరణ్ దేశాయ్ వంటి ప్రఖ్యాత భారతీయ రచయితలు గతంలో క్రాస్‌వర్డ్ బుక్ అవార్డును గెల్చుకున్నారు.