ఖేలో ఇండియా 2020 క్రీడలు
Posted On January 23, 2020
*ఖేలో ఇండియా 2020 క్రీడల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది.
* అసోంలోని గౌహతీ వేదికగా 13 రోజులపాటు ఈ క్రీడలు జరిగాయి.
*మహారాష్ట్ర యువక్రీడాకారులు 78 స్వర్ణాలతో సహా మొత్తం 256 పతకాలతో మొదటి స్థానంలో నిలిచారు.మహారాష్ట్ర్ర మొత్తం 78 స్వర్ణ, 77 రజత, 101 కాంస్యపతకాలు సాధించింది.
*హర్యానా మొత్తం 200 పతకాలతో రెండోస్థానం లో నిలిచింది.
*అండర్ -17 బాలికల ఈతలో మహారాష్ట్ర్ర స్విమ్మర్ కరీనా షంక్తా రెండో స్వర్ణం సాధించింది.మహారాష్ట్ర్ర ఖేలో ఇండియా ఓవరాల్ విజేతగా నిలవడం వరుసగా ఇది రెండోసారి.
*ఢిల్లీ మూడు, కర్నాటక నాలుగు, ఉత్తరప్రదేశ్ ఐదుస్థానాలలో నిలిచాయి. ఆతిథ్య అసోం ఏడోస్థానం దక్కించుకొంది.
*మొత్తం 28 రాష్ట్రాలు పతకాల పట్టికలో చోటు సంపాదించగా. తెలంగాణా 7 స్వర్ణాలతో సహా 21 పతకాలతో 15వ స్థానంలో నిలిచింది.
*ఆంధ్రప్రదేశ్ మూడు స్వర్ణాలతో సహా మొత్తం 17 పతకాలతో 22వ స్థానంలో నిలిచింది.