మణిపూర్ బ్లాక్‌రైస్‌కు భౌగోళిక సూచిక(జిఐ) ట్యాగ్ గుర్తింపు
Posted On May 02, 2020
మణిపూర్ బ్లాక్ రైస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మణిపూర్ బ్లాక్‌రైస్ భౌగోళిక సూచిక(జిఐ) ట్యాగ్ పొందినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. మణిపూర్ బ్లాక్ రైస్‌కు జిఐ ట్యాగ్ ఇవ్వాలంటూ మణిపూర్ లోని చాఖావో (బ్లాక్ రైస్) కన్సార్టియం ప్రొడ్యూసర్స్ ఏడాది కిందట దరఖాస్తు చేసింది. , ఇది శతాబ్దాల నుండి మణిపూర్లో సాగు చేయబడుతోంది. మణిపూర్ బ్లాక్‌రైస్ జిఐ ట్యాగ్‌ను పొందడం అరుదైన విషయమన్నారు. ఇప్పుడు బ్లాక్‌రైస్ విత్తనాలను ప్రపంచంలో ఎక్కడైనా అమ్మే శక్తి తమకు ఉందన్నారు. వాణిజ్య పరంగా మంచి అవకాశాలు ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే విందులో వండుతారు. దీనిని 'చాఖావో ఖీర్' గా కూడా పిలుస్తుంటారు. అక్కడి వైద్య నిపుణులు చాఖావోను సంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతుంటారు. మణిపూర్ బ్లాక్‌రైస్ కిలో రూ.100 నుంచి 120 మధ్య ఇంఫాల్ స్థానిక మార్కెట్లో లభిస్తుంది.