మైక్రోమాక్స్‌తో తెలంగాణ ప్రభుత్వం MOU
Posted On May 14, 2020
మైక్రోమాక్స్ బ్రాండ్ గాడ్జెట్‌లను ఉత్పత్తి చేసే మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారు భగవతి ప్రొడక్ట్స్, కోవిడ్ -19 మహమ్మారి కోసం అభివృద్ధి చేస్తున్న మెకానికల్ వెంటిలేటర్లను తయారు చేయడానికి తెలంగాణ ప్రభుత్వ చొరవ అయిన టివర్క్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ’ఈ సిటీ’లోని తమ యూనిట్లో మెకానికల్ వెంటిలేటర్లను మైక్రోమాక్స్ తయారు చేయనుంది. మైక్రో మాక్స్‌తో ఒప్పందం ద్వారా అతి తక్కువ సమయంలో అత్యుత్తమ వెంటిలేటర్ల తయారీకి అవకాశం ఏర్పడిందని టీ వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి తెలిపారు. తక్కువ ధరలో తయారయ్యే ఈ మెకానికల్ వెంటిలేటర్‌ను హైదరాబాద్‌కు చెందిన పలు హార్డ్‌వేర్ స్టార్టప్‌లు, వాణిజ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.