అథ్లెట్ జూమా ఖాతూన్‌పై నాలుగేళ్ల నిషేధం
Posted On April 28, 2020
డోపింగ్‌లో పట్టుబడటంతో భారత మహిళా మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జూమా ఖాతూన్‌పై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షలో జూమా ఖాతూన్ నిషేధిత ఉత్ప్రేరకం 'డి హైడ్రోక్లోరోమిథైల్ టెస్టోస్టిరాన్' వాడినట్లు తేలింది. 2018 జూన్‌లో గువాహటి వేదికగా జరిగిన అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జుమా 1500, 5000 మీటర్ల విభాగాల్లో బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 2018 జూన్ నుంచి నవంబర్ వరకు ఆమె పాల్గొన్న ఈవెంట్స్‌లో సాధించిన అన్ని ఫలితాలను రద్దు చేశారు. ఆమె నుంచి జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్) శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. అయితే అదే శాంపిల్‌ను 'వాడా' కెనాడాలోని తమ ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్‌గా వచ్చింది.