పీఎం కేర్స్‌కు సాయుధ దళాల భారీ సాయం
Posted On May 08, 2020
సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగస్తులు, అధికారులు 11 నెలల పాటు ప్రతినెలా ఒకరోజు తమ వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి(పీఎం కేర్స్)కి స్వచ్ఛందంగా ఇవ్వనున్నారు. ఇందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రూ. 5,500 కోట్లు ప్రధాని సహాయనిధికి జమ అయ్యే అవకాశం ఉందని అంచన. పీఎం కేర్స్‌కి సిబ్బంది వేతనాలనుంచి ఇచ్చే విరాళం మే 2020నుంచి ప్రారంభమై మార్చి 2021 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.