వరి, తృణధాన్యాల కనీస మద్దతు ధర
Posted On July 04, 2019
* ఉత్పత్తి వ్యయానికి కనీసం రూ.1.5 రెట్లు అధికంగా ఉండేలా మద్దతుధరలను నిర్ణయించాలని గతేడాది ప్రభుత్వం ప్రకటించిన మేరకు వీటిని పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించాడు.
* 2019-20 పంట సీజన్‌కు (జూలై-జూన్) గానూ సాధారణ, ఏ గ్రేడ్ రకం వరికి రూ.65 చొప్పున మద్దతు ధర పెంచినట్లు చెప్పారు.
* ఈ ఏడాది సాధారణ వరి క్వింటాల్ ధర రూ.1,815కు, ఏ గ్రేడ్ రకం వరి ధర రూ.1,835కు పెరిగింది.
* వరితోపాటు నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఇతర తృణధాన్యాల జొన్న - 120 రూ. ,రాగులు - 253. కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
కనీస మద్దతు ధర
* 1948 VT కృష్మచారి కమిటీ ఆహార ధాన్యాల దరల విధాన కమిటీ మద్దతు దరల విధానం ప్రవేశ పెట్టటానికి సూచించారు.
* 1957 అశోక్ మెహతా కమిటీ నాట్లు వేసే సమయంలో MSP ప్రకటించాలని సిఫారసు చేసింది.
* 1964 LK జా కమిటీ MSP నిర్ణయంచటానికై శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు చేయాలనీ సిఫారసు చేసింది
* 1965 న్యూ ఢిల్లీ కేంద్రంగా APC (అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్) ఏర్పాటు.
* 1985 లో APC పేరును CACP గా (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ) గా మార్పు
* CACP : chairman Vijay Paul Sharma