మైనింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ సదస్సు
Posted On February 04, 2020
దక్షిణాఫ్రికా దేశంలోని కేవ్ టౌన్ లో 6వ తేదీ వరకూ జరుగుతున్న అతిపెద్ద మైనింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ సదస్సులో సింగరేణి ప్రతినిధి బృందం పాల్గొంటోంది ఎస్.చంద్రశేఖర్, జి.ఎం. (శ్రీరాంపూర్) శ్రీ కె.లక్ష్మీనారాయణ, జి.ఎం. (సేఫ్టీ) శ్రీ ఎస్.వెంకటేశ్వర్లు సింగరేణి తరపున ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు.
‘‘మైనింగ్ ఇన్‌డబా’’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రపంచస్థాయి ఎగ్జిబిషన్ లో ప్రపంచ వ్యాప్తంగా 94 దేశాలకు చెందిన 600 మైనింగ్ యంత్రాల తయారీ దారులు తాము కొత్తగా తయారు చేసిన యంత్రాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతున్నారు. వీటిని సందర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా 7 వేల మందికి పైగా మైనింగ్ సంస్థ ప్రతినిధులు, మైనింగ్ మేథావులు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన దేశం నుండి కోలిండియాకు చెందిన బొగ్గు కంపెనీ ప్రతినిధులతో పాటు సింగరేణి సంస్థ నుంచి ఉన్నతాధికారుల బృందం వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
మైనింగ్ లో కొత్తగా వస్తున్న ఆధునిక పద్ధతులు, యంత్ర విభాగాలు, రక్షణతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం, ఎక్కువ పరిమాణంలో బొగ్గు తవ్వితీసే విధానం మొదలైన విషయాలపై ఇక్కడ వివిధ దేశాల పరిశ్రమల వారు తాము తయారుచేసిన యంత్రాలను ప్రదర్శిస్తున్నారు.