ఎన్‌జిఒల లైసెన్స్ రద్దు
Posted On January 30, 2020
*పలు స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జిఒ) లైసెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
*వాటికి అందే విదేశీ విరాళాలపై కూడా చర్యలకు దిగింది.
*ఎన్‌జిఒలను బహిష్కరించడంతో పాటు వేలాది సంస్థల లైసెన్సులను రద్దు చేసింది.
*విదేశాల నుండి అందే విరాళాలకు నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు నిధులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంది.
*ఎన్జీవోలు --విరాళాల వివరాలు
1998-99 నుండి 2017-18 వరకు విదేశీ సహాయ నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద మొత్తం రూ. 2.88 లక్షల కోట్లు విరాళాలుగా ఎన్‌జిఒలు స్వీకరించాయి.
1998-99లో విదేశీ విరాళాలు రూ.3,925 కోట్లు కాగా, 2017-18లో రూ.16,902 కోట్లు అంటే నాలుగు రెట్లు పెరిగాయి.
ఒకే ఏడాదిలో రూ.18 వేలకోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయి.
విదేశీ వనరుల నుండి వచ్చిన విరాళాలలో కూడా పెరుగుదల కనిపించింది. 2014-15లో విదేశీ విరాళాలు రూ.15,297 కాగా, మరుసటి ఏడాదిలో రూ. 17,765కు పెరిగాయి.
2016-17లో గరిష్టంగా రూ. 18వేల కోట్ల రూపాయలను దాటి నిధులు రూ.18,109 కోట్లు అందాయి.
విదేశీ విరాళాలు 1999-2000లోరూ. 4,535 కోట్లు కాగా, మరుసటి ఏడాది రూ. 4,871 కోట్లు.
2001-02లో రూ. 5.047 కోట్లు కాగా, 2002-03లో రూ. 5, 105 కోట్లు వచ్చాయి. ఈ సంఖ్య 2003-04లో రూ.6,257 కోట్ల రూపాయలకు పెరిగింది.
మరుసటి ఏడాది రూ. 7,877 కోట్లకు పెరిగింది. అలాగే 2005-06లో రూ.11 వేల కోట్ల రూపాయలను దాటి 2005-06లో రూ. 11,007 కోట్లకు చేరుకుంది. అయితే 2006-07లో రూ. 9,663కి పడిపోయింది.
2007-08లో రూ. పది కోట్లను దాటి రూ. 10,802 కోట్లకు, మరుసటి ఏడాది రూ. 10,338 కోట్లకు చేరుకోగా, ఆ తర్వాతి సంవత్సరంలో రూ.10,334 కోట్లు.
విదేశీ విరాళాలు 2012-13లో మొదటిసారి రూ. 12వేల కోట్లను దాటి రూ. 12, 614 కోట్లకు చేరుకున్నాయి.
మరుసటి ఏడాదిలో మరింత పెరిగి రూ. 14,853 కోట్లకు చేరుకున్నాయి.