భారత్ నేపాల్ మధ్య రెండో చెక్ పోస్ట్
Posted On January 22, 2020
*భారత్, నేపాల్ సరిహద్దులో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో కలిసి వీడియో లింక్ ద్వారా జనవరి 21వ తేదీన ప్రారంభించారు.
* ప్రాజెక్ట్ -జోగ్‌బని-బిరాట్‌నగర్ చెక్‌పోస్టు నిర్మాణం
*ప్రాజెక్టు వ్యయం -ఈ చెక్‌పోస్ట్ నిర్మాణం కోసం భారత్ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్‌కు అందించింది.
*ఉద్దేశ్యం-
1.ఇరుగుపొరుగున గల అన్ని మిత్ర దేశాలతో వాణిజ్యాన్ని, సరుకు రవాణా వాహనాల రాకపోకలను సరళతరం చేయడానికి, సాఫీగా కొనసాగించడానికి, వ్యాపారం, సంస్కృతి, విద్య వంటి రంగాలలో తమ మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచుకునేందుకు లక్ష్యంగా జోగ్‌బని-బిరాట్‌నగర్ చెక్‌పోస్టును భారత్ ఇచ్చిన రూ.140 కోట్ల ఆర్థిక సహకారంతో నిర్మించారు.
2.260 ఎకరాల్లో ఈ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్ట్ రోజుకు 500 ట్రక్కులను తనిఖీ చేసి పంపించగలుగుతుంది.
3.భారత్-నేపాల్ మధ్య నిర్మించిన రెండో చెక్‌పోస్ట్ ఇది.
4.తొలి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను 2018లో రాక్సౌల్-బీర్‌గుంజ్‌లో నిర్మించారు.
5.భారత్, నేపాల్ రోడ్డు, రైలు, ట్రాన్స్‌మిషన్ లైన్లు వంటి అనేక సీమాంతర అనుసంధాన ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తున్నాయి.
2015నాటి భూకంపంతో నష్టపోయిన నేపాల్ కు భారత్ సహాయం అందించింది.50 వేల ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టింది.45వేలు పూర్తికాగా, మిగతా వాటిని త్వరలోనే పూర్తి చేయనున్నారు.
*నేపాల్ --హిమాలయాలలో ఉన్న నేపాల్ రాజ్యము, 2006 నేపాలు ప్రజస్వామ్య ఉద్యమము|2006 నేపాలు ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యము. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది. ఇది ఒక భూపరివేష్టిత దేశం (లాండ్‌లాక్)