ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ముస్తఫా ఖాద్మీ
Posted On May 08, 2020
ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ అధిపతి ముస్తఫా ఖాద్మీని పార్లమెంటు 2020 మే 7 న ఎన్నుకుంది. ఇరాక్‌లో ఐదు నెలల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా 2019 నవంబర్‌లో అడెల్ అబ్దుల్ మహదీ రాజీనామా చేసిన తరువాత ముస్తఫా ఖాద్మీ ఇరాక్ ప్రధాని అయ్యారు. ముస్తఫా ఖాద్మీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్.