ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడు నరీందర్ బత్రా పదవీకాలం పొడిగింపు
Posted On May 12, 2020
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్ష పదవిలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) చీఫ్ నరీందర్ బత్రా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఈ ఏడాది న్యూఢిల్లీ వేదికగా అక్టోబర్ 28న జరగాల్సిన ఎఫ్‌ఐహెచ్ వార్షిక సమావేశం కరోనా కారణంగా వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు ఎఫ్‌ఐహెచ్ శనివారం ప్రకటించింది. బత్రా 2016 నవంబర్‌లో ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా బత్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో కూడా సభ్యత్వం ఉంది.